వైరస్ ఒక చిన్న, ప్రాణములేని జీవి. ఇది ప్రాణం ఉన్న బ్యాక్టీరియా, మొక్కలు మరియు ఇతర జీవులకు సోకి రకరకాల వ్యాధులను కలగజేస్తుంది. కొన్ని సార్లు మరణానికి కూడా దారి తీసే అవకాశం ఉంది. మానవ శరీరాల మాదిరిగా, వైరస్లు కణాలను కలిగి ఉండవు అందువల్ల వాటి జనాభాని పెంచుకోవటం కోసం వాటికి ఒక కణం అవసరం. వైరస్ నిర్మాణం లో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి: వైరస్ గురించి సమాచారాన్ని కలిగి ఉన్న రసాయన నిర్మాణం, దాని చుట్టూ ఒక రక్షణ కవచం, మరియు బయటి తొడుగు. జీవుల నుండి భిన్నంగా ఉన్నప్పటికీ, వైరస్లు మరియు జీవుల మధ్య ఉన్న సారూప్యత ఏమిటంటే అవి రెండూ జన్యు సమాచార రసాయన నిర్మాణాలను కలిగి ఉంటాయి (జీవులలో DNA మరియు RNA, వైరస్‌లో RNA మాత్రం). ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరంలో ఉన్న మన కణాలని వాడుకొని ప్రతిరూపం చెందుతుంది. పునరుత్పత్తి తరువాత కణాలు పగిలి వైరస్ ఇతర కణాలకు వ్యాపిస్తుంది. కొన్నిసార్లు బహుళ కాపీలను సృష్టించేటప్పుడు, రసాయన నిర్మాణాల(RNA) ద్వారా తీసుకువెళ్ళబడిన సమాచారం మారవచ్చు. అందుకే దీనిని నయం చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. SARS, ఇన్ఫ్లుఎంజా వైరస్ మరియు n-COVID 19 మానవులను ప్రభావితం చేసిన వైరస్‌లకు కొన్ని ఉదాహరణలు. ప్రస్తుత n-COVID 19 వైరస్ గతంలో జంతువులకు సోకింది తర్వాత చైనాలోని జంతువుల మార్కెట్ ద్వారా ఇది మానవులకు సోకింది.
వైరస్ అంటే ఏమిటి?
