కొరోనా వైరస్ మనుషుల యొక్క శ్వాశకోశవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దోమలు డెంగ్యూ మరియు చికెంగున్యా లాంటి వ్యాధులను కలగజేస్తాయని తెలిసిన విషయమే, కానీ ఇవి కొరోనా వైరస్ ని వ్యాపింపజేయవు. కొరోనా వైరస్ ఉన్న మనుషులను కుట్టిన దోమలు, వేరే మనుషులకు వ్యాప్తి చేయలేవు. ఈ వైరస్ దగ్గు మరియు తుమ్మడం వలన వచ్చే తుంపరల వలన, లాలాజలం మరియు చీముడు ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఇప్పటి వరకు ఆధారాలు లేవు. ఈ వైరస్ సోకిన వారి నుండి సామాజిక దూరాన్ని పాటించడం వలన దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. సామాజిక దూరం అంటే ఈ వైరస్ సోకిన లేదా లక్షణాలు ఉన్న వారి నుండి మరియు వారు వాడిన వస్తువులకు దూరంగా ఉండటం. ఈ వైరస్ సోకిన వారికి ఉండే సాధారణ లక్షణాలు: పొడిదగ్గు, జ్వరం మరియు అలసట.
