Telugu

మానసిక ఆరోగ్యం గురించి అపోహలు

మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మందబుద్ధి ఉంటుందని సూచించే ఆధారాలు లేవు. సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఎవరైనా మానసిక రోగాలతో బాధపడొచ్చు. మానసిక అనారోగ్యం బలహీనతకు లేదా సోమరితనానికి సంకేతం కాదు.  ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి – తీవ్రమైన ఒత్తిడి, చిన్నప్పుడు ఎదుర్కున్న భయానక సంఘటనలు వంటివి. ఇది ఒక వ్యక్తి యొక్క ప్రతికూల వైఖరి, బద్ధకం లేదా సంకల్ప లేమిని సూచించదు. … Continue readingమానసిక ఆరోగ్యం గురించి అపోహలు

ఋతుస్రావం గురించిన అపోహలు

అనేక సంస్కృతులలో ఋతుస్రావం లేదా బహిష్టుని అపవిత్రంగా భావిస్తారు. దీనికి ప్రధాన కారణం దాని చుట్టూ ఉన్న అనేక అపోహలు. ఈ అపోహలను తొలగించడానికి వాటి మూలాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ ప్రయత్నంలో భాగంగా మూడు  అపోహలను క్రింద వివరించాము: 1. బహిష్టు సమయంలో దేవాలయాలకు వెళ్లకూడదు అలాగే జనాలతో మాట్లాడకూడదు. ఇలా ఎందుకంటే ఋతు రక్తాన్ని అపవిత్రంగా (అశుద్ధంగా) పరిగణించేవారు. ఇంకా పరిగణిస్తున్నారు కూడా. శాస్త్రీయంగా ఇది నిజం కాదు. ఇది కేవలం … Continue readingఋతుస్రావం గురించిన అపోహలు

ఋతు చక్రం 1 వ భాగము:  శరీర ధర్మ శాస్త్రము

సంతానోత్పత్తి వ్యవస్థలో భాగంగా పరిగణించబడే అవయవాలలో నెలనెల జరిగే జీవ మార్పులు ఋతు చక్రం లో భాగం. ఇది అండాశయాలు (ovaries), గర్భాశయం (uterus), మరియు యోని (vagina) వంటి స్త్రీ పునరుత్పత్తి అవయవాలు కలిగి ఉన్న వ్యక్తులలో కనిపించే సహజ ప్రక్రియ. ప్రతి నెల, అండాశయాలు ఒక అండం (Ova or egg) అని పిలువబడే ప్రత్యేక బీజ కణాలు ఉత్పత్తి చేస్తాయి.  ఇలా విడుదలైన అండం లైంగిక సంపర్కం సమయంలో శుక్రంతో (sperm) ఫలదీకరణం … Continue reading “ఋతు చక్రం 1 వ భాగము:  శరీర ధర్మ శాస్త్రము”

ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు రోగనిరోధక శక్తిని పెంచలేవు.

COVID19 మహమ్మారి సమయంలో, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు ఒక ప్రముఖ వ్యక్తిగత సంరక్షణగా మారాయి. సబ్బు మరియు నీరు అందుబాటులో లేనప్పుడు చేతులు శుభ్రం చేయడానికి హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించవచ్చని CDC(వ్యాధి నియంత్రణ కేంద్రం) భావించింది. ఈ ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లలో చాలా వరకు ఐసోప్రొపైల్ ఆల్కహాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ ఉంటాయి. ఆల్కహాల్ బ్యాక్టీరియా యొక్క కణ త్వచాల నిర్మాణాన్ని మరియు వైరస్ల కవచాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల, కఠినమైన ఉపరితలాలు లేదా చర్మంపై … Continue reading “ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు రోగనిరోధక శక్తిని పెంచలేవు.”

రోగనిరోధక శక్తి అంటే ఏమిటి?

రోగనిరోధక శక్తి అన్నది పేరు సూచించునట్టుగా బాహ్య రోగక్రిముల బారినుండి మనలను కాపాడే శారీరక వ్యవస్థ. మన దేహంలో ఉండే అణువులు, కణాలు  ఒక బలగంగా మారి మనకు ఒక రక్షా కవచాన్ని  ఏర్పరుస్తాయి. ఇవి బయటనుండి శరీరంలోకి ప్రవేశించే ఏ రోగ క్రిములతోనైనా, పదార్థంతోనైనా పోరాడుతాయి. రోగనిరోధక వ్యవస్థలో ఉండే కణాలు పరాన్నజీవి అయిన క్రిముల పైనున్న కణాలకు అంటుకొని అవి మన శరీరమంతా సోకకుండా తప్పించడానికి ప్రయత్నిస్తాయి. కొన్ని రోగనిరోధకశక్తి కణాలు రోగకారక క్రిములనుండి … Continue reading “రోగనిరోధక శక్తి అంటే ఏమిటి?”

ఎన్-కోవిడ్19 జీవాయుధం (bio-weapon) కాదు. ఎందుకంటే

కొరోనావైరస్ వ్యాప్తి మొదలైన నాటినుండే, ఇది ప్రయోగశాలలో తయారైన వైరసేనన్న పుకార్లు కూడా అంతకన్నా వేగంగా వ్యాప్తి చెందాయి. అమెరికాలో ఒకరు ఇది చైనాలోని వూహాన్ లో నాలుగో స్థాయి బయోసేఫ్టీ ప్రయోగశాలలో తయారయ్యిందన్న వదంతిని లేవనెత్తారు.  నాలుగో స్థాయి బయోసేఫ్టీ శాలలు ఇబోలా వంటి అతి ప్రమాదకరమైన వైరసులను పరీక్షించి, పరిశోధించే ప్రయోగశాలలు. ఇటువంటి ప్రయోగశాలలలో భద్రత చాలా పటిష్టంగా ఉంటుంది. అటువంటి ప్రయోగశాల ఒకటి వూహాన్ లో ఉన్నంత మాత్రాన ఇతర ఏ ఆధారాలు … Continue reading “ఎన్-కోవిడ్19 జీవాయుధం (bio-weapon) కాదు. ఎందుకంటే”

దోమలు కొరోనా ను వ్యాపింపజేయవు.

కొరోనా వైరస్ మనుషుల యొక్క శ్వాశకోశవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దోమలు డెంగ్యూ మరియు చికెంగున్యా లాంటి వ్యాధులను కలగజేస్తాయని తెలిసిన విషయమే, కానీ ఇవి  కొరోనా వైరస్ ని వ్యాపింపజేయవు. కొరోనా వైరస్ ఉన్న మనుషులను కుట్టిన దోమలు, వేరే మనుషులకు వ్యాప్తి చేయలేవు. ఈ వైరస్ దగ్గు మరియు తుమ్మడం వలన వచ్చే తుంపరల వలన, లాలాజలం మరియు చీముడు ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది … Continue reading “దోమలు కొరోనా ను వ్యాపింపజేయవు.”

వైరస్ అంటే ఏమిటి?

వైరస్ ఒక చిన్న, ప్రాణములేని జీవి. ఇది ప్రాణం ఉన్న బ్యాక్టీరియా, మొక్కలు మరియు ఇతర జీవులకు సోకి రకరకాల వ్యాధులను కలగజేస్తుంది. కొన్ని సార్లు మరణానికి కూడా దారి తీసే అవకాశం ఉంది. మానవ శరీరాల మాదిరిగా, వైరస్లు కణాలను కలిగి ఉండవు అందువల్ల వాటి జనాభాని పెంచుకోవటం కోసం వాటికి ఒక కణం అవసరం. వైరస్ నిర్మాణం లో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి: వైరస్ గురించి సమాచారాన్ని కలిగి ఉన్న రసాయన నిర్మాణం, దాని చుట్టూ ఒక రక్షణ … Continue reading “వైరస్ అంటే ఏమిటి?”


Get new content delivered directly to your inbox.

%d bloggers like this: